ఫన్ మోడ్‌లో మహేష్ గ్యాంగ్!
ABN , First Publish Date - 2020-11-14T18:25:34+05:30 IST
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం హాలీడే ట్రిప్‌లో ఉన్నాడు.

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం హాలీడే ట్రిప్‌లో ఉన్నాడు. కరోనా కారణంగా 8 నెలలు పూర్తిగా ఇంటికే పరిమితమైన మహేష్ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ తన పిల్లలతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నాడు.
తాజాగా మహేష్ షేర్ చేసిన ఓ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పిల్లలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోను మహేష్ పంచుకున్నాడు. `ముగింపు లేని నవ్వులు, సరదా, ప్రేమ.. నువ్వు ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది. నా రెండు చిన్న పిల్లర్స్‌కు హ్యాపీ చిల్డ్రన్స్ డే` అని మహేష్ పేర్కొన్నాడు.