బిగ్‌బాయ్‌కి 9 ఏళ్లంటున్న మహేశ్
ABN , First Publish Date - 2020-05-11T17:02:04+05:30 IST
మదర్స్ డే సందర్భంగా అమ్మలందరికీ శుభాకాంక్షలు చెప్పిన మహేశ్ మరో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

లాక్‌డౌన్ సమయంలో సినీ సెలబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. తమకు నచ్చిన పనులు చేస్తునో, కొత్త విషయాలు నేర్చుకుంటునో ఖాళీ సమయాన్ని గడుపుతున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ విషయానికి వస్తే కొడుకు గౌతమ్, కుమార్తె సితారతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. మదర్స్ డే సందర్భంగా అమ్మలందరికీ శుభాకాంక్షలు చెప్పిన మహేశ్ మరో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తన రెండు పెంపుడు కుక్కలతో ఉన్న చిన్న వీడియో షేర్ చేసిన మహేశ్ ‘నా బిగ్‌బాయ్‌కి 9 ఏళ్లు.. గొప్ప సమయం’ అంటూ మెసేజ్ కూడా పెట్టారు మహేశ్. ఈ వీడియోలో మహేశ్ చాలా యంగ్‌గా కనపడుతున్నారు. నెటిజన్స్ ఈ లుక్ చూసి కొంపదీసి గౌతమ్ కాదు కదా! అంటూ కామెంట్స్ కూడా చేశారు.