పవన్‌ను దాటేసిన మహేశ్
ABN , First Publish Date - 2020-07-27T13:27:58+05:30 IST
తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ అభిమానులు ఆయన్ని ట్వీట్స్‌తో అగ్రస్థానంలో నిలబెట్టారు. ఆదివారం 24 గంటల్లో మూడు కోట్ల ట్వీట్స్‌తో మహేశ్ అభిమానులు ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రెండ్‌ను క్రియేట్ చేయడం విశేషం.

సాధారణంగా స్టార్ హీరోలు కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో మాత్రం స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలను ట్వీట్స్‌తో రికార్డులు క్రియేట్ చేసేలా చేస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ అభిమానులు ఆయన్ని ట్వీట్స్‌తో అగ్రస్థానంలో నిలబెట్టారు. ఆదివారం 24 గంటల్లో మూడు కోట్ల ట్వీట్స్‌తో మహేశ్ అభిమానులు ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రెండ్‌ను క్రియేట్ చేయడం విశేషం. ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు హ్యాపీబర్త్ డే మహేశ్ సీడీపీ అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశారు. ఈ నెలలో పవన్ అభిమానులు 27 మిలియన్ ట్వీట్స్‌తో రికార్డ్ క్రియేట్ చేయగా.. మహేశ్ అభిమానులు దాన్ని దాటేశారు. ఈ విషయంలో మహేశ్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.