ప్రభాస్‌కి మహేశ్‌ బర్త్‌డే విషెష్‌

ABN , First Publish Date - 2020-10-23T17:41:17+05:30 IST

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రభాస్‌కు బర్త్‌డే విషెష్‌ను తెలిపారు.

ప్రభాస్‌కి మహేశ్‌ బర్త్‌డే విషెష్‌

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ ప్యాన్‌ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఓ తెలుగు హీరో ఇలా ప్యాన్‌ ఇండియా రేంజ్‌ను దాటి గుర్తింపు సంపాదించుకోవడం మనందరికీ సంతోషకరమైన విషయమే. ఈ ప్యాన్‌ ఇండియా స్టార్‌ పుట్టినరోజు శుక్రవారం(అక్టోబర్‌ 23). ఈ సందర్భంగా ఆయనకు అందరూ సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రభాస్‌కు బర్త్‌డే విషెష్‌ను తెలిపారు. "హ్యాపీబర్త్‌ డే ప్రభాస్‌..నీకు అనంతమైన విజయం, ఆనందం, ప్రశాంతత కలగాలని కోరుకుంటున్నాను" అన్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్‌ మూవీ 'రాధేశ్యామ్‌' సినిమా నుండి బీట్స్‌ ఆఫ్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. 
Updated Date - 2020-10-23T17:41:17+05:30 IST

Read more