11 మిలియన్ల క్లబ్‌లోకి సూపర్‌స్టార్‌

ABN , First Publish Date - 2020-12-21T04:41:22+05:30 IST

సూపర్‌ స్టార్ మహేష్ బాబు 11 మిలియన్ల ప్లస్‌ క్లబ్‌లోకి చేరారు. అదేంటి ఆయనకు మిలియన్లు కొత్తేమీ కాదు కదా.. ప్రత్యేకించి ఈ మిలియన్ల క్లబ్‌ ఏంటి అనుకుంటున్నారు

11 మిలియన్ల క్లబ్‌లోకి సూపర్‌స్టార్‌

సూపర్‌ స్టార్ మహేష్ బాబు 11 మిలియన్ల ప్లస్‌ క్లబ్‌లోకి చేరారు. అదేంటి ఆయనకు మిలియన్లు కొత్తేమీ కాదు కదా.. ప్రత్యేకించి ఈ మిలియన్ల క్లబ్‌ ఏంటి అనుకుంటున్నారు కదా. విషయంలోకి వస్తే.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబును సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 11 మిలియన్ ప్లస్‌కు చేరింది. కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌ నుంచి మహేష్‌ బాబు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. అభిమానులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ.. మహేష్‌ ట్వీట్స్‌ చేస్తుండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మహేష్‌ బాబు 11 మిలియన్ల క్లబ్‌లోకి చేరడంతో.. అభిమానులు ఓ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-12-21T04:41:22+05:30 IST