సూపర్‌స్టార్‌ సీక్రెట్స్‌ అన్నీ రివీల్‌ చేస్తా: మహేష్‌ సోదరి

ABN , First Publish Date - 2020-11-09T00:26:11+05:30 IST

మొన్నటి సూపర్ స్టార్ కృష్ణ కూతురు, నేటి సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల పుట్టినరోజు నవంబర్ 8. తండ్రి బాటలో పయనిస్తూ పిన్నవయసులోనే

సూపర్‌స్టార్‌ సీక్రెట్స్‌ అన్నీ రివీల్‌ చేస్తా: మహేష్‌ సోదరి

మొన్నటి సూపర్ స్టార్ కృష్ణ కూతురు, నేటి సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల పుట్టినరోజు నవంబర్ 8. తండ్రి బాటలో పయనిస్తూ పిన్నవయసులోనే 'శభాష్ గోపి'లో నటించిన మంజుల ఆ తరువాత నటనాభిలాషతో కొన్ని చిత్రాల్లో నటించారు. నిర్మాతగా, దర్శకురాలిగానూ సాగిన మంజుల ప్రస్తుతం ప్రజల్లో 'వెల్ నెస్' పై ఆసక్తి కలిగించబోతున్నారు. అందుకోసం కొన్ని 'వెల్ నెస్' ప్రొడక్ట్స్ నూ ఆమె విడుదల చేయనున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా ఆమె ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా ముచ్చటించారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గురించి, ఘట్టమనేని ఫ్యామిలీ గురించి.. ఇలా ఎన్నో విషయాలను ఆమె తెలియజేశారు. అవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.


''మహేష్‌ నాకంటే చిన్నవాడు అయినప్పటికీ.. చాలా మెచ్యూర్డ్ పర్సన్‌. నేను పెద్దదానిని.. మహేష్‌ని నేను గైడ్‌ చేస్తానని అంతా అనుకుంటారు.. కానీ మహేషే నన్ను గైడ్‌ చేస్తుంటాడు. ఏదైనా కరెక్ట్‌గా సలహా ఇస్తుంటాడు. అందరికీ బయటికి సూపర్‌ స్టార్‌లా కనిపిస్తాడు.. కానీ ఆ సూపర్‌ స్టార్‌ వెనుక చాలా సీక్రెట్స్‌ ఉన్నాయి. వాటన్నింటినీ త్వరలోనే రివీల్‌ చేస్తాను. ఇక అందరూ నా బ్యూటీ సీక్రెట్స్‌ ఏమటని అడుగుతుంటారు. సీక్రెట్స్‌ అంటూ ఏమీ లేవు కానీ.. నాన్నగారి జీన్స్ అని మాత్రం చెప్పగలను. నేను అందరికీ ఫిల్మ్‌ మేకర్‌గానే తెలుసు.. కానీ నాలో ఇంకో కోణం కూడా ఉంది. వెల్‌ నెస్‌ గురించి, ఫిట్‌ నెస్‌, ఈటింగ్‌ రైట్‌, ఎక్సర్‌సైజ్‌ వంటివి నా జీవితంలో చాలా ప్రధాన పాత్రని కలిగిఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి వీటిపై ఎంతో అవగాహన ఉంది. నా జీవితంలో నాకు ఎంతో ఉపయోగకరమైన వాటిని.. ఇప్పుడు జనం కోసం కూడా అందించాలని అనుకుంటున్నాను.." అని చెబుతూ.. అవేంటో తెలుపుతూ.. మనిషి సంతోషంగా ఉండటానికి ఏమేం చేయాలో ఆమె ఈ వీడియోలో తెలిపారు. ఇవే కాదు.. ఇంకా చాలా విషయాలను ఆమె షేర్‌ చేసుకున్నారు. అవేంటో తెలియాలంటే పై వీడియో చూడాల్సిందే. 

Updated Date - 2020-11-09T00:26:11+05:30 IST