రెండు పాత్రల్లో

ABN , First Publish Date - 2020-02-08T05:41:17+05:30 IST

మహేశ్‌బాబు... తన తదుపరి చిత్రంతో డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి. టాలీవుడ్‌ వర్గాలు. చిన్నతనంలో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘కొడుకు దిద్దిన ...

రెండు పాత్రల్లో

మహేశ్‌బాబు... తన తదుపరి చిత్రంతో డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి. టాలీవుడ్‌ వర్గాలు. చిన్నతనంలో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘కొడుకు దిద్దిన కాపురం’లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఆ తర్వాత 2004లో ఎస్‌.ఏ రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ‘నాని’ క్లైమాక్స్‌ సీన్‌లో తండ్రీ కొడుకులుగా డ్యూయల్‌ రోల్‌ చేసి మెప్పించారు. అయితే స్టార్‌డమ్‌ వచ్చాక మహేశ్‌ డ్యూయల్‌ రోల్‌ చేసింది లేదు. ఇప్పుడు ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాతగా మహేశ్‌ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే! ‘మహర్షి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ఇందులో మహేశ్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారట. అయితే ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. మహేశ్‌ అమెరికా ట్రిప్‌ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాక ఈ చిత్రం షూటింగ్‌ మొదలవుతుంది. 

Updated Date - 2020-02-08T05:41:17+05:30 IST