ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. మహేష్ ఎమోషనల్ పోస్ట్!

ABN , First Publish Date - 2020-06-05T19:37:59+05:30 IST

మనం సురక్షితంగా, క్షేమంగా ఉండాలంటే ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించాలని

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. మహేష్ ఎమోషనల్ పోస్ట్!

మనం సురక్షితంగా, క్షేమంగా ఉండాలంటే ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూపర్‌స్టార్ మహేష్ బాబు పేర్కొన్నాడు. నేడు (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాది `టైమ్ ఫర్ నేచర్` థీమ్‌తో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతిని కాపాడండంటూ పలువురు ప్రముఖులు పిలుపునిస్తున్నారు. 


మహేష్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. దలైలామా కోట్స్‌ను ఉపయోగిస్తూ ఆ పోస్ట్‌ను ప్రారంభించాడు. `మనందరం నివసిస్తున్న ఈ పర్యావరణాన్ని కాపాడడం మనందరి వ్యక్తిగత, సామాజిక బాధ్యత- దలైలామా. మన జీవితం ప్రకృతితో అనుసంధానమై ఉంది. ప్రకృతిని రక్షించుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలి. మనందరం ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన, సమతుల పర్యావరణ వ్యవస్థను సృష్టించాలి. నీటిని ఆదా చేయండి. చెట్లను కాపాడండి. విద్యుత్తును ఆదా చేయండి. కర్బన ఉద్గారాలను తగ్గించండి. అడవులను కాపాడండి. సముద్రాలను కాపాడండి. జంతువులను రక్షించండి. మీకు ఏది ముఖ్యమో ఎంచుకోండి. ఈ రోజు ప్రారంభించండి. దీన్ని కలిసి చేద్దాం` అంటూ మహేష్ పోస్ట్ చేశాడు. 
Updated Date - 2020-06-05T19:37:59+05:30 IST