ఆకట్టుకుంటున్న `మహాసముద్రం` పోస్టర్!
ABN , First Publish Date - 2020-11-14T16:18:40+05:30 IST
`ఆర్ఎక్స్ 100` సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న తాజా చిత్రం `మహా సముద్రం`.

`ఆర్ఎక్స్ 100` సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న తాజా చిత్రం `మహా సముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదితీ రావు హైదరి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
దీపావళి సందర్భంగా చిత్రయూనిట్ ఓ థీమ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ థీమ్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంటెన్స్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. `నేను తరంగాల కంటే మొండిగా ఉన్నాను.. సముద్రాల కంటే లోతుగా ఉన్నాను` అంటూ శర్వా పేర్కొన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
Read more