మహాభారతంలో కూలర్... అసలు విషయం ఇదే !

ABN , First Publish Date - 2020-04-25T10:51:36+05:30 IST

మహాభారతంలోని ఒక సన్నివేశానికి సంబంధించి ప్రేక్షకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ సన్నివేశంలో, భీష్మ పితామహుని వెనుక కూలర్ ....

మహాభారతంలో కూలర్... అసలు విషయం ఇదే !

మహాభారతంలోని ఒక సన్నివేశానికి సంబంధించి ప్రేక్షకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ సన్నివేశంలో, భీష్మ పితామహుని  వెనుక కూలర్ ఆకారం కనిపించింది. ఈ కారణంగా సోషల్ మీడియాలో ఈ సన్నివేశంపై మైమ్స్ రూపొందిస్తున్నారు. అయితే  మహాభారతం వీరాభిమానులు ఈ సన్నివేశంలో ఉన్నది కూలర్ కాదని, ఒక స్తంభం అని చెబుతున్నారు. మహా భారతంలోని ఆ దృశ్యంనకు సంబంధించిన ఫోటోను ఒక అభిమాని ట్విట్టర్లో పంచుకున్నాడు. అది ఒక స్తంభం అని రాశాడు. ఈ అభిమాని ట్వీట్ తరువాత పలువురు అతనికి మద్దతుగా ట్వీట్ చేయడం ప్రారంభించారు. దూరదర్శన్ లో మహాభారతం తిరిగి ప్రసారం అవుతోంది. టిఆర్‌పి చార్టులో రామాయణం, మహాభారతం మంచి రేటింగ్‌ను సాధిస్తున్నాయి. 

Updated Date - 2020-04-25T10:51:36+05:30 IST