`ప్రేమమ్` భామ వెడ్డింగ్ సిరీస్!

ABN , First Publish Date - 2020-11-04T20:18:15+05:30 IST

`ప్రేమమ్` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాతో మలయాళ సినిమాకు ప‌రిచయం అయింది హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్.

`ప్రేమమ్` భామ వెడ్డింగ్ సిరీస్!

`ప్రేమమ్` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకు ప‌రిచయం అయింది హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్. అదే సినిమా తెలుగు రీమేక్‌లో కూడా నటించి టాలీవుడ్ ప్రేక్షకులనూ అలరించింది. ప్రస్తుతం మ‌ల‌యాళంతోపాటు త‌మిళ సినిమాల్లోనూ న‌టిస్తోంది.


తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. `వెడ్డింగ్ సిరీస్` పేరుతో ఆమె పెళ్లి దుస్తుల్లో ఉన్న తన ఫొటోలను పోస్ట్ చేస్తోంది. ఈ ఫొటోలను చూసి అందరూ పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ ఫొటోలు తన పెళ్లికి సంబంధించినవి కావని మడోన్నా స్పష్టం చేసింది.  



Updated Date - 2020-11-04T20:18:15+05:30 IST

Read more