ఐదుగురు ఈగోయిస్ట్‌లతో...

ABN , First Publish Date - 2020-02-08T05:52:20+05:30 IST

మధుసూధన్‌, వైభవీ జోషి, శ్రీజిత్‌ ఘోష్‌ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘www.మీనాబజార్‌’. రానా సునీల్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో నాగేంద్ర ఈ చిత్రాన్ని...

ఐదుగురు ఈగోయిస్ట్‌లతో...

మధుసూధన్‌, వైభవీ జోషి, శ్రీజిత్‌ ఘోష్‌ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘www.మీనాబజార్‌’.   రానా సునీల్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో నాగేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. నవీన్‌ యాదవ్‌, దివ్యవాణి, హేమ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రతి మనిషిలో ఈగో ఉంటుంది. అలా ఈగో ఉన్న ఐదుగురు వ్యక్తులు కలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అన్నది ఈ సినిమా. కద్రి మణికాంత్‌ చక్కని సంగీతం అందించారు’’ అని చెప్పారు. త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత వెల్లడించారు. 


Updated Date - 2020-02-08T05:52:20+05:30 IST