టాలీవుడ్‌లోనూ డ్ర‌గ్ క‌ల్చ‌ర్‌.. మాధ‌వీల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ABN , First Publish Date - 2020-08-31T15:09:12+05:30 IST

‘టాలీవుడ్ పార్టీల్లో డ్ర‌గ్స్ వాడుతారు.. దీనిపై తెలంగా ఎన్‌సీబీ అధికారులు, ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌మైన దృష్టిపెట్టాలి’ అని ఫేస్‌బుక్ ద్వారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త‌.

టాలీవుడ్‌లోనూ డ్ర‌గ్ క‌ల్చ‌ర్‌.. మాధ‌వీల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘టాలీవుడ్ పార్టీల్లో డ్ర‌గ్స్ వాడుతారు.. దీనిపై తెలంగాణ ఎన్‌సీబీ అధికారులు, ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టాలి’ అని ఫేస్‌బుక్ ద్వారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త‌. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ క్ర‌మంలో సుశాంత్ సింగ్ డ్ర‌గ్స్ తీసుకునేవాడంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. న‌టి కంగనా ర‌నౌత్ కూడా బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ ఉంద‌ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అలాగే శాండిల్‌వుడ్‌లోనూ డ్ర‌గ్స్ వాడుతారంటూ ఓ జ‌ర్న‌లిస్ట్ చెప్ప‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో మాధ‌వీల‌త టాలీవుడ్‌లో జ‌రిగే పార్టీల్లో డ్ర‌గ్స్ వాడుతార‌ని, ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం, పోలీసులు ప్ర‌త్యేక‌మైన దృష్టిపెట్టాల‌ని చెబుతూ టాలీవుడ్ స్టార్స్‌పై పీత‌క‌న్ను కాకుండా సీరియ‌స్ దృష్టి పెట్టాల‌న్నారు మాధ‌వీల‌త‌. Updated Date - 2020-08-31T15:09:12+05:30 IST