పిల్లల బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సంజయ్ భార్య!

ABN , First Publish Date - 2020-10-23T21:55:09+05:30 IST

ఊపిరితిత్తుల కేన్సర్ నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతుడిగా మారినట్టు బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్

పిల్లల బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సంజయ్ భార్య!

ఊపిరితిత్తుల కేన్సర్ నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతుడిగా మారినట్టు బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పిల్లలు షారాన్, ఇక్రా పుట్టినరోజు నాడు సంజయ్ ఆ ప్రకటన చేశాడు. తన ఆరోగ్యమే తన పిల్లలకు తను ఇవ్వబోతున్న పెద్ద బహుమతి అంటూ సంజయ్ పేర్కొన్నాడు. 


ఈ సంతోషకర సమయంలో పిల్లల బర్త్‌డే సంజయ్ భార్య మాన్యత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి దుబాయ్‌లో ఉంటున్న మాన్యత అక్కడే గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆనందం, ఆరోగ్యం, ధైర్యం, సహనంతో ఉండాలని పేర్కొన్నారు. Updated Date - 2020-10-23T21:55:09+05:30 IST

Read more