లవ్‌ థ్రిల్లర్‌ ‘ఉన్‌ కాదల్‌ ఇరుందాల్‌’

ABN , First Publish Date - 2020-02-27T15:53:31+05:30 IST

శ్రీకాంత్‌, చంద్రికరవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు హషీమ్‌ మరికర్‌ తెరకెక్కించిన ‘ఉన్‌ కాదల్‌ ఇరుందాల్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లవ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ

లవ్‌ థ్రిల్లర్‌ ‘ఉన్‌ కాదల్‌ ఇరుందాల్‌’

శ్రీకాంత్‌, చంద్రికరవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు హషీమ్‌ మరికర్‌ తెరకెక్కించిన ‘ఉన్‌ కాదల్‌ ఇరుందాల్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లవ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ చిత్రం విజయంపై చిత్ర బృందం ధీమాతో ఉంది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన గ్లామరస్‌ స్టిల్స్‌ యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌ చంద్రిక రవి మోస్ట్‌ గ్లామరస్‌గా కనిపించనుందని ఆ స్టిల్స్‌ చూస్తుంటే అర్ధమవుతుంది. లీనా, హర్షిక, రియాజ్‌ ఖాన్‌, సోనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ‘ఉన్‌ కాదల్‌ ఇరుందాల్‌’ విజయం తథ్యమని శ్రీకాంత్‌ నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం అతను ‘మహా’, ‘ఖాకీ’, ‘మిరుగా’, ‘సంభవం’ అనే మరో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు.

Updated Date - 2020-02-27T15:53:31+05:30 IST