హాట్ కేకులా చైతూ, అఖిల్‌ సినిమాల శాటిలైట్ రైట్స్

ABN , First Publish Date - 2020-07-31T03:45:22+05:30 IST

కరోనాతో ఒకవైపు థియేటర్స్ అన్నీ మూతపడి ఉంటే.. మరో వైపు ఓటీటీ హడావుడి మాములుగా లేదు. ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే సినిమాల విషయంలో టీఆర్పీ కూడా

హాట్ కేకులా చైతూ, అఖిల్‌ సినిమాల శాటిలైట్ రైట్స్

కరోనాతో ఒకవైపు థియేటర్స్ అన్నీ మూతపడి ఉంటే.. మరో వైపు ఓటీటీ హడావుడి మాములుగా లేదు. ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే సినిమాల విషయంలో టీఆర్పీ కూడా మాములుగా ఉండటం లేదు. ప్లాప్ సినిమాలు కూడా ప్రస్తుతం బుల్లితెరపై పెద్ద హిట్‌గా నిలుస్తున్నాయి. దీంతో శాటిలైట్ బిజినెస్ కోసం పలు ఛానెల్స్ పోటీ పడుతున్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే టాలీవుడ్‌లోని ఇద్దరు అన్నదమ్ముల సినిమాల శాటిలైట్ హక్కులు హాట్ కేకులా అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరనుకుంటున్నారా? యువ సామ్రాట్ నాగచైతన్య, యువ హీరో అఖిల్.


నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. అలాగే అఖిల్ అక్కినేని హీరోగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన గీతా ఆర్ట్స్2 బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల శాటిలైట్ రైట్స్‌ను ఓ ఛానల్ అధిక మొత్తానికి దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ను అందుకుంటాయో తెలియాలంటే.. ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు.

Updated Date - 2020-07-31T03:45:22+05:30 IST