`లవ్‌స్టోరీ` పోస్టర్ చూశారా?
ABN , First Publish Date - 2020-11-14T22:29:15+05:30 IST
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం `లవ్‌స్టోరీ`.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం `లవ్‌స్టోరీ`. దీపావళి పండగను పురస్కరించుకొని తాజాగా ఈ సినిమా పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ శేఖర్ కమ్ముల స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు గెటప్స్‌లో చూడముచ్చటగా ఉన్నారు.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. అయితే ఇంకా విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేదు. దీపావళి సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే తాజాగా విడుదలైన పోస్టర్‌లో రిలీజ్ డేట్ ప్రస్తావన లేదు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై నారాయణ్ దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read more