క్రైమ్‌ థ్రిల్లర్‌లో లాస్లియా

ABN , First Publish Date - 2020-08-31T15:47:33+05:30 IST

ఆక్సల్‌ ఫిలివ్‌ సంస్థ నిర్మించనున్న తాజా తమిళ చిత్రంలో బిగ్‌బాస్‌3 ఫేమ్‌ లాస్లియా కీలకమైన పాత్రలో నటించనుంది.

క్రైమ్‌ థ్రిల్లర్‌లో లాస్లియా

‘మరకత నాణయమ్‌’, ‘రాక్షసన్‌’, ‘ఓమై కడవులే’ వంటి హిట్‌ చిత్రాలను అందించిన ఆక్సల్‌ ఫిలివ్‌ సంస్థ నిర్మించనున్న తాజా తమిళ చిత్రంలో బిగ్‌బాస్‌3 ఫేమ్‌ లాస్లియా కీలకమైన పాత్రలో నటించనుంది. ఈ చిత్రానికి జేఎం రాజా శరవణన్‌ దర్శకత్వం వహించనున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రాన్ని రూపొం దిస్తున్నామని నూతన నటుడు కే పూర్ణేశ్‌ హీరోగా పరిచయమవుతున్నాడని దర్శకుడు జేఎం రాజా శరవణన్‌ తెలిపారు. త్వరలో ఈ చిత్రం వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.

Updated Date - 2020-08-31T15:47:33+05:30 IST