అంతరిక్ష యాత్రకు వెళ్లినట్టుంది!

ABN , First Publish Date - 2020-06-08T04:20:31+05:30 IST

‘‘సెలూన్‌కి కాదు... స్పేస్‌ మిషన్‌ (అంతరిక్ష యాత్ర)కు వెళ్లినట్టుంది’’ అని కథానాయిక ప్రణీతా సుభాష్‌ అన్నారు. రెండు నెలల లాక్‌డౌన్‌ అనంతరం సెలూన్‌కి వెళ్లి హెయిర్‌ కటింగ్‌ చేయించుకున్నారామె! మాస్క్‌ ధరించి సెలూన్‌లోకి వెళ్లడం...

అంతరిక్ష యాత్రకు వెళ్లినట్టుంది!

‘‘సెలూన్‌కి కాదు... స్పేస్‌ మిషన్‌ (అంతరిక్ష యాత్ర)కు వెళ్లినట్టుంది’’ అని కథానాయిక ప్రణీతా సుభాష్‌ అన్నారు. రెండు నెలల లాక్‌డౌన్‌ అనంతరం సెలూన్‌కి వెళ్లి హెయిర్‌ కటింగ్‌ చేయించుకున్నారామె! మాస్క్‌ ధరించి సెలూన్‌లోకి వెళ్లడం... 

వెళ్లగానే అక్కడి సిబ్బంది బాడీ టెంపరేచర్‌ చెక్‌ చేయడం, హెయిర్‌ కట్‌ చేసేవాళ్లు పీపీఈ కిట్‌ ధరించడం... ఇవన్నీ సరికొత్త అనుభవమని ఆమె అన్నారు. ప్రణీత మాట్లాడుతూ ‘‘లాక్‌డౌన్‌లో చాలామంది కథానాయికలు సొంతంగా హెయిర్‌కట్‌ చేసుకున్నారు. నా సహచరులు చేసినట్టు నేను ప్రయోగం చేయలేను. సెలూన్స్‌ ఓపెన్‌ చేయగానే వెళ్లడానికి కొంచెం ఆలోచించాను. అందుకని, వారం రోజులు ఆగి సురక్షితమని తెలిశాక వెళ్లాను’’ అన్నారు. బెంగళూరులో ఆదివారం డీసీపీ రోహిణి కటోచ్‌ సెపట్‌ను కలసిన ప్రణీత, బెంగళూరు దక్షిణ విభాగంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల సిబ్బందికి అవసరమయ్యే మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ 1, 2లలో సొంత ఫౌండేషన్‌ ద్వారా 21 రోజుల పాటు 75 వేల మందికి, ‘హెల్ప్‌ ది హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ స్వచ్ఛంద సంస్థతో కలిసి 500 కుటుంబాలకు భోజనం సమకూర్చినట్టు ఆమె తెలిపారు.

Updated Date - 2020-06-08T04:20:31+05:30 IST