స్పేస్‌లోకి వెళ్లినట్టుంది

ABN , First Publish Date - 2020-06-12T06:23:31+05:30 IST

ఎప్పుడూ పొట్టి దుస్తులతో దర్శనమిచ్చే రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నిండైన దుస్తులతో కెమెరాకు కంటపడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటి వరకూ ఇంటికే పరిమితమైన రకుల్‌... పీపీఈ ధరించి ఢిల్లీ ప్రయాణమయ్యారు...

స్పేస్‌లోకి వెళ్లినట్టుంది

ఎప్పుడూ పొట్టి దుస్తులతో దర్శనమిచ్చే రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నిండైన దుస్తులతో కెమెరాకు కంటపడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటి వరకూ ఇంటికే పరిమితమైన రకుల్‌... పీపీఈ ధరించి ఢిల్లీ ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ఆమె హిందీలో ‘ఎటాక్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ ఢిల్లీలో ప్రారంభంకానుంది. అందుకే రకుల్‌ ఇలా తగిన జాగ్రత్తలతో ఢిల్లీకి బయలుదేరారు. తన దర్శకుడు లక్ష్యరాజ్‌ ఆనంద్‌ను పరిచయం చేస్తూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘మిషన్‌ ఢిల్లీ’ అని హ్యాష్‌ట్యాగ్‌ చేసి ఫొటోలు షేర్‌ చేశారు. ‘‘ఎటాక్‌’ సినిమా షూటింగ్‌ కోసం ఢిల్లీకి వెళ్తున్నా. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ఈ జాగ్రత్తలన్నీ తప్పనిసరి. సెట్‌లో సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తాం. ఈ పీపీఈ కిట్స్‌ ధరించి ఫ్లైట్‌ ఎక్కితే స్పేస్‌లోకి వెళ్లినట్టుంది’’ అని రకుల్‌ పేర్కొన్నారు.


Updated Date - 2020-06-12T06:23:31+05:30 IST