వరుడు కావలెను?

ABN , First Publish Date - 2020-11-03T10:19:53+05:30 IST

నాగశౌర్య కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రం నిర్మిస్తోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న...

వరుడు కావలెను?

నాగశౌర్య కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రం నిర్మిస్తోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఆ చిత్రానికి ‘వరుడు కావలెను’ టైటిల్‌ ఖరారు చేసినట్టు భోగట్టా. త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ చేస్తున్నారట. హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

Updated Date - 2020-11-03T10:19:53+05:30 IST