ఓటీటీలో ‘లాకప్’ విడుదల
ABN , First Publish Date - 2020-08-14T18:22:53+05:30 IST
యువనటుడు నితిన్ సత్యా నిర్మించిన ‘లాకప్’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఎంజీ ఛార్లెస్ దర్శకుడు.

యువనటుడు నితిన్ సత్యా నిర్మించిన ‘లాకప్’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఎంజీ ఛార్లెస్ దర్శకుడు. కరోనో లాక్‌డౌన్ కారణంగా నాలుగు నెలలకు పైగా థియేటర్లు మూతపడ్డాయి. దీనితో షూటింగ్ పూర్తి చేసుకున్న తమిళ చిత్రాల విడుదల ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో జ్యోతిక నటించిన ‘పొన్‌మగళ్ వందాల్’, కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన ‘డేని’ చిత్రాలను ఓటీటీలో విడుదలయ్యాయి. తాజాగా వైభవ్, వెంకట్ ప్రభు, వాణీభోజన్, పూర్ణా తదితరులు నటించిన ‘లాకప్’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.