కెమెరా వెనుక రామాయణం...

ABN , First Publish Date - 2020-04-25T11:32:28+05:30 IST

దూరదర్శన్‌లో రామాయణం తిరిగి ప్రారంభమై సంచలనం సృష్టిస్తోంది. ఈ సీరియల్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

కెమెరా వెనుక రామాయణం...

దూరదర్శన్‌లో రామాయణం తిరిగి ప్రారంభమై సంచలనం సృష్టిస్తోంది. ఈ సీరియల్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీనితో సీరియల్‌తో సంబంధం ఉన్న నటీనటులు చాలా ఆసక్తికరమైన విషయాలు  చెబుతున్నారు. రామాయణంలో సీత పాత్ర పోషించిన దీపిక చిఖలియా... రామాయణం షూటింగ్ చేసేటప్పుడు కెమెరా వెనుక ఏమి జరిగేదో వెల్లడించారు. దీపిక చిఖలియా ఒక పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటోలో అరుణ్ గోవిల్, దీపిక చిఖలియా రామానంద్ సాగర్ పక్కన కనిపిస్తారు. సీతారాములకు రామానంద్ ఏదో సన్నివేశాన్ని వివరిస్తున్నారు. ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దూరదర్శన్‌లో రామాయణం తిరిగి ప్రసారం కావడంతో ఛానెల్‌కు మంచి టిఆర్‌పి లభిస్తోంది. చాలా కాలం తరువాత ఈ  ఛానెల్ కు మంచి రోజులు తిరిగి వచ్చాయి. మహాభారతం, శక్తిమాన్ తదితర పాత సీరియల్స్ కూడా దూరదర్శన్ లో ప్రసారం అవుతున్నాయి.

Updated Date - 2020-04-25T11:32:28+05:30 IST