దేశం మంచికోస‌మే లాక్‌డౌన్‌: స‌ంజ‌య్‌ద‌త్‌

ABN , First Publish Date - 2020-05-04T10:53:00+05:30 IST

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశంలో మే 17 వ‌ర‌కూ లాక్‌డౌన్ విధించారు. ఈ నేప‌ధ్యంలో ముంబైలో మే 17 వ‌ర‌కూ ఎటువంటి సినిమాల షూటింగులు జ‌ర‌గ‌వు. దీంతో చిత్ర‌ప‌రిశ్ర‌మపై ఆధార‌ప‌డిన‌వారంతా...

దేశం మంచికోస‌మే లాక్‌డౌన్‌: స‌ంజ‌య్‌ద‌త్‌

ముంబై: క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశంలో మే 17 వ‌ర‌కూ లాక్‌డౌన్ విధించారు. ఈ నేప‌ధ్యంలో ముంబైలో మే 17 వ‌ర‌కూ ఎటువంటి సినిమాల షూటింగులు జ‌ర‌గ‌వు. దీంతో చిత్ర‌ప‌రిశ్ర‌మపై ఆధార‌ప‌డిన‌వారంతా లాక్‌డౌన్ నియమాలు పాటిస్తూ, ఇళ్ల‌లోనే ఉంటున్నారు. దేశంలో లాక్‌డౌన్ విధించ‌డంపై ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ స్పందించారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా చాలా రంగాలు ప్ర‌భావిత‌మ‌య్యాయి. అయితే అంద‌రి భ‌ద్ర‌త‌, ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం లాక్‌డౌన్ చేయ‌డం అత్య‌వ‌స‌రం. ప్రాధ‌మికంగా అంద‌రినీ కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ముందు ప్రేక్ష‌కుల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌. త‌రువాత వినోదం. ఇప్ప‌డు పెద్ద ప్రాజెక్టులు కొన‌సాగేందుకు కొంత‌స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు. కానీ దేశం మంచి కోసం లాక్‌డౌన్ విధించ‌డం త‌ప్ప‌నిస‌రి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వీలైనంత ఎక్కువ‌మందికి సాయం చేయాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఎవ‌రూ ఆక‌లితో అల‌మ‌టించకూడ‌ద‌ని, న‌ర్గీస్ ఫౌండేష‌న్ భావిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌నం ఒక‌రికి ఒక‌రుగా మెల‌గాల‌ని సంజ‌య్ ద‌త్ అన్నారు. 


Updated Date - 2020-05-04T10:53:00+05:30 IST