పుస్తకంగా పైడి జయరాజ్‌ జీవితం

ABN , First Publish Date - 2020-09-29T06:50:58+05:30 IST

అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రం... కరీంనగర్‌లో ఓ పెద్ద కుటుంబం. తొమ్మిదో సంతానంగా పుట్టిన ఓ అబ్బాయి ఇంజినీరింగ్‌ చదివి... లండన్‌ వెళ్లాలని కలలు కంటాడు...

పుస్తకంగా పైడి జయరాజ్‌ జీవితం

అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రం... కరీంనగర్‌లో ఓ పెద్ద కుటుంబం. తొమ్మిదో సంతానంగా పుట్టిన ఓ అబ్బాయి ఇంజినీరింగ్‌ చదివి... లండన్‌ వెళ్లాలని కలలు కంటాడు. కుటుంబ పరిస్థితులు సహకరించక ఇంటర్‌ అవ్వగానే ఇల్లు వదిలి బతుకుదెరువు కోసం బాంబే నగరానికి వెళతాడు. అక్కడ డాక్‌యార్డ్‌లో రోజుకు మూడు రూపాయల కూలీకి ఓ చిన్న ఉద్యోగంలో చేరి... స్నేహితుడి ద్వారా అనుకోకుండా సినిమా రంగంలోకి అడుగుపెడతాడు. ఆయనే హిందీ చిత్రరంగం తొలితరం స్టార్లలో ఒకరిగా... ఎన్నో విజయవంతమైన సినిమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచిన ఘనుడు పైడి జయరామ్‌. హిందీలోనే కాకుండా మరాఠీ, గుజరాతీ తదితర భాషల్లో సైతం నటించి మెప్పించిన ఆయన... ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు’ (1980) అందుకున్న తొలి తెలుగువాడు. బాలీవుడ్‌లో 70 ఏళ్లపాటు సినీ ప్రస్థానాన్ని కొనసాగించిన ఏకైక నటుడిగా జయరాజ్‌ పేరు ‘గిన్నిస్‌ బుక్‌’లో కూడా నమోదైంది. నటుడిగా... దర్శకుడిగా... నిర్మాతగా... మూకీల నుంచి టాకీల వరకు ఎన్నో చిరస్మరణీయ చిత్రరాజాలు అందించిన జయరాజ్‌ 111వ జయంతి ఉత్సవం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, సినీ ప్రయాణంపై టి.శ్రీకాంత్‌... ‘టు బాంబే... విత్‌ లవ్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. 260 పేజీలున్న ఈ పుస్తకంలో అరుదైన ఫొటోలు జయరాజ్‌ మళ్లీ మన ముందుకు వచ్చిన అనుభూతి కలిగిస్తాయి. ఈ పుస్తకం కాపీలు అమెజాన్‌లో లభిస్తాయి. వెల రూ.2,000. 

Updated Date - 2020-09-29T06:50:58+05:30 IST