ఎలా మాట్లాడాలో నేర్చుకో!

ABN , First Publish Date - 2020-06-10T04:58:50+05:30 IST

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! మిర్యాల రవీందర్‌ నిర్మిస్తున్నారు...

ఎలా మాట్లాడాలో నేర్చుకో!

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! మిర్యాల రవీందర్‌ నిర్మిస్తున్నారు. బుధవారం బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో! శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనే దానికీ.. శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా? అనే దానికీ చాలా తేడా ఉందిరా లమ్డీ కొడకా’’ అని బీబీ3 ఫస్ట్‌ రోర్‌ పేరుతో విడుదల చేసిన టీజర్‌లో బాలకృష్ణ చెప్పిన సంభాషణలు పవర్‌ఫుల్‌గా, మాస్సీగా ఉన్నాయి. మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదాపడింది. వచ్చే నెలలో సెట్స్‌ మీదకెళ్లే అవకాశముంది. 


తండ్రి పాట తనయుడి నోట..

పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ తన అభిమానులకు ప్రత్యేక కానుక ఇచ్చారు. తన తండ్రి నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమాలోని ‘శివశంకరీ... శివానంద లహరి’ గీతాన్ని బాలకృష్ణ ఆలపించారు. ఈ పాటను సోషల్‌ మీడియా వేదికగా మంగళవారం విడుదల చేశారు. శివశంకరీ పాటలో ఎన్టీఆర్‌ సన్నివేశాలకు బాలకృష్ణ స్వరాన్ని జతచేశారు.


Updated Date - 2020-06-10T04:58:50+05:30 IST