`ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్` లోగో లాంఛ్ చేసిన `రాధేశ్యామ్` డైరెక్టర్!

ABN , First Publish Date - 2020-12-29T16:49:49+05:30 IST

మంచి నిర్మాణ విలువలు ఉన్న సంస్థలను తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఆదరిస్తుంది.

`ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్` లోగో లాంఛ్ చేసిన `రాధేశ్యామ్` డైరెక్టర్!

మంచి నిర్మాణ విలువలు ఉన్న సంస్థలను తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఆదరిస్తుంది. ఇలాంటి నిర్మాణ సంస్థలతో పనిచేయడానికి ప్రముఖ కథానాయకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా టాలీవుడ్‌లోకి మరో నిర్మాణ సంస్థ అడుగుపెట్టింది. రాహుల్ చౌదరి సారథ్యంలో `ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్` అనే ఓ కొత్త నిర్మాణ సంస్థ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.


`రాధేశ్యామ్` సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ బ్యానర్ లోగోను తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ.. `రాహుల్ చౌదరి డైనమిక్ పర్సన్. ఆయన బ్యానర్‌లో వచ్చే సినిమాలన్నీ అద్భుత విజయాలు సాధించాలి. మంచి నిర్మాతగా పేరు తెచ్చుకోవాల`ని ఆకాక్షించారు. నిర్మాత రాహుల్ చౌదరి మాట్లాడుతూ.. `అత్యున్నత నిర్మాణాత్మక విలువలకు పెద్ద పీట వేస్తూ ఈ సంస్థ నుంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. మా బ్యానర్‌పై ముందుగా భారీ సినిమాలను నిర్మిస్తామ`ని అన్నారు. 

Updated Date - 2020-12-29T16:49:49+05:30 IST