'లక్ష్మీ బాంబ్'’ ట్రైలర్‌... 24 గంటల్లో సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2020-10-12T21:25:55+05:30 IST

రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌, కియారా అద్వాని జంటగా నటిస్తున్న చిత్రం 'లక్ష్మీ బాంబ్'’.

'లక్ష్మీ బాంబ్'’ ట్రైలర్‌... 24 గంటల్లో సరికొత్త రికార్డు

రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌, కియారా అద్వాని జంటగా నటిస్తున్న చిత్రం 'లక్ష్మీ బాంబ్'’. ఈ చిత్రం నవంబర్‌ 9వ తేది ఓటీటీ ద్వారా విడుదల కానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. యూ ట్యూబ్‌లో మాత్రమే 33 మిలియన్‌ మంది ట్రైలర్‌  తిలకించారు. ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితరాలల్లో ట్రైలర్‌ చూసిన వారి సంఖ్య 70 మిలియన్లు దాటింది. 24 గంటల్లో అధిక శాతం ప్రేక్షకులు వీక్షించిన ట్రైలర్‌గా రికార్డు నెలకొల్పింది. రాఘవ లారెన్స్‌ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమిళంలో విడుదలైన ‘కాంచన’ చిత్రానికి రీమేక్‌ ఈ చిత్రం. బాలీవుడ్‌ ప్రేక్షకులకు అనుగుణంగా చిత్ర కథలో పలు మార్పులు చేశారు. ట్రైలర్‌కు ఊహించిన దాని కంటే ప్రేక్షకుల ఆదరణ లబించడంతో చిత్ర యూనిట్‌ ఆనందంలో మునిగిపోయారు.


Updated Date - 2020-10-12T21:25:55+05:30 IST

Read more