‘లక్ష్మీ బాంబ్’ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

ABN , First Publish Date - 2020-06-16T23:27:14+05:30 IST

కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారి ముని సిరీస్‌తో చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో నుంచి వచ్చినదే ‘కాంచన’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా

‘లక్ష్మీ బాంబ్’ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారి ముని సిరీస్‌తో చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో నుంచి వచ్చినదే ‘కాంచన’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా భయపెట్టిందో తెలియంది కాదు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ని హీరోగా పెట్టి లారెన్సే రూపొందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల విషయంలో ఈ మధ్య ఎటువంటి వార్తలు వినిపించాయో తెలిసిందే. ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేసేందుకు భారీ ఆఫర్ రావడంతో.. మేకర్స్ ఈ చిత్రాన్ని డిజిటల్‌గా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. 


డిస్నీ హాట్ స్టార్ ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని రూ. 125 కోట్లకు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం అంటే చాలా ఎక్కువే. అందుకే మేకర్స్ డిజిటల్‌కే మొగ్గుచూపారు. ఇక ఈ చిత్రం ఓ ప్రత్యేక తేదీన స్ట్రీమింగ్ కాబోతోంది. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు డిస్నీ హాట్ స్టార్ రెడీ అవుతోంది. దీనికి సంబంధించి మేకర్స్‌తో కూడా చర్చలు ముగిశాయని తెలుస్తోంది. 

Updated Date - 2020-06-16T23:27:14+05:30 IST