షూటింగ్ అంటే భయమేస్తోంది: లావణ్య

ABN , First Publish Date - 2020-05-26T04:00:47+05:30 IST

కరోనా దెబ్బతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. చేయిచేయి కలపడానికి లేదు. ఆత్మీయంగా హత్తుకోవడానికి లేదు. బంధువులు కూడా దూరంగా ఉండే

షూటింగ్ అంటే భయమేస్తోంది: లావణ్య

కరోనా దెబ్బతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. చేయిచేయి కలపడానికి లేదు. ఆత్మీయంగా హత్తుకోవడానికి లేదు. బంధువులు కూడా దూరంగా ఉండే పలకరించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా అదనంగా ఫేస్‌కి మాస్క్‌లు. అవి లేకుండా బయటికి వెళితే ఫైన్‌లు. ఇలా మారిపోయింది ప్రపంచం. మరి ఇది ఇంకా ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. భవిష్యత్ మొత్తం ఇలా భయం భయంగా బతకాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏదిఏమైనా కరోనా అనే పేరు ప్రపంచాన్ని వణికించింది.. ఇంకా వణికిస్తుంది అన్నది మాత్రం నిజం. మరి ఇలాంటి భయాన్నే బయటపెట్టింది బ్యూటీ లావణ్య త్రిపాఠి.


ప్రస్తుతం లాక్‌డౌన్‌లో కొన్ని కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి. త్వరలో సినిమా ఇండస్ట్రీకి కూడా అనుమతులు రానున్నాయి. మరి ఇలాంటి తరుణంలో తిరిగి షూటింగ్‌లు మొదలైతే.. షూటింగ్‌లో పాల్గొనక తప్పదు. కొత్తగా అంగీకరించకపోయినా.. ఇప్పటికే అంగీకరించిన చిత్రాల కోసం ఖచ్చితంగా షూటింగ్‌లో పాల్గొనాలి. ఇప్పుడున్న పరిస్థితులలో షూటింగ్‌లో పాల్గొనాలంటే భయంగా ఉంది. అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో.. అనే దానిపై అనుమానంగా ఉంది. సెట్స్‌లో ఒక్కరికి పాజిటివ్ అని తేలినా యూనిట్ మొత్తానికి అది వచ్చేస్తుంది. అందుకే చాలా భయంగా ఉంది.. అంటూ లావణ్య తన మనసులోని భయాన్ని బయటపెట్టింది.

Updated Date - 2020-05-26T04:00:47+05:30 IST