గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో లావణ్య త్రిపాఠి

ABN , First Publish Date - 2020-08-25T00:29:19+05:30 IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో లావణ్య త్రిపాఠి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులు కుతూహలంతో ముందుకు రావడం జరుగుతుంది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి సోమవారం సహస్త్రధర; ఉత్తరాఖండ్‌లో తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి 50 మొక్కలను నాటారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో తెలియజేసింది.


ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మా అందరి చేత మొక్కలు నాటిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్‌గారికి అభినందనలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇదేవిధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. నా వంతుగా మరో ఐదుగురిని ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను. నటి రీతు వర్మ, హీరో కార్తికేయ, వెన్నెల కిషోర్, సైనా నెహ్వాల్, అనితా రెడ్డిలను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నాను..’’ అని తెలిపారు. Updated Date - 2020-08-25T00:29:19+05:30 IST