లావణ్యకు ‘చావు క‌బురు చ‌ల్లగా’ టీమ్‌ ట్రీట్‌

ABN , First Publish Date - 2020-12-15T23:06:37+05:30 IST

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠికి పుట్టినరోజు సందర్భంగా ‘చావు క‌బురు చ‌ల్లగా’ టీమ్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఏమిటా ట్రీట్ అనుకుంటున్నారా? సినిమాలోని ఆమె కొత్త లుక్‌ని చిత్రయూనిట్

లావణ్యకు ‘చావు క‌బురు చ‌ల్లగా’ టీమ్‌ ట్రీట్‌

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠికి పుట్టినరోజు సందర్భంగా ‘చావు క‌బురు చ‌ల్లగా’ టీమ్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఏమిటా ట్రీట్ అనుకుంటున్నారా? సినిమాలోని ఆమె కొత్త లుక్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో, బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా.. నూత‌న ద‌ర్శకుడు కౌశిక్ పెగ‌ళ్లపాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్లగా’. ఈ సినిమాలో డింపుల్‌ బ్యూటి లావ‌ణ్య త్రిపాఠి మ‌ల్లిక అనే హైద‌రాబాదీ బ‌స్తీ అమ్మాయిగా క‌నిపించ‌నుంది. మ‌ల్లిక‌గా లావ‌ణ్య త్రిపాఠి లుక్ ఇప్ప‌టికే విడుద‌లై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లావ‌ణ్య త్రిపాఠి పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్రయూనిట్‌ కొత్త లుక్‌ని వదిలింది. శొట్ట బుగ్గ‌ల‌తో న‌వ్వుతూ చూడగానే ఆకట్టుకునేలా ఈ లుక్‌ ఉంది.


ఈ లుక్‌ విడుదల సందర్భంగా నిర్మాత బ‌న్నీ వాసు మాట్లాడుతూ.. జిఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్ లో భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, గీతగోవిందం, ప్రతిరోజూ పండ‌గే చిత్రాలు ఘ‌న‌ విజయాలు సాధించాయి. అలాంటి బ్యాన‌ర్ లో వ‌చ్చే ప్రతీ చిత్రంపై ప్రేక్షకుల‌కి మంచి అంచ‌నాలు వుంటాయి. దీనిని దృష్థిలో పెట్టుకునే చిత్రాలు నిర్మిస్తున్నాం. కార్తికేయ గ‌త చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. బస్తీబాల‌రాజుగా కార్తీకేయ ఎలా హడావుడి చేశాడో ఇప్పటికే టీజర్‌లో చూశారు. ఇక బర్త్ డే బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ఈ సినిమాలో మ‌ల్లికగా.. నేచురల్‌గా నటించింది. త‌న పాత్ర ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఆమె బర్త్ డే సందర్భంగా న్యూలుక్‌ని విడుదల చేశాం. ఈ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆక‌ట్టుకునే రీతిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు కౌశిక్ తెర‌కెక్కిస్తున్నాడు.." అని తెలిపారు.

Updated Date - 2020-12-15T23:06:37+05:30 IST

Read more