కరోనా ఎఫెక్ట్: అలాంటి సీన్లు చేయనంటున్న లావణ్య!
ABN , First Publish Date - 2020-05-25T16:53:52+05:30 IST
ఊహించని ఉపద్రవంలా వచ్చిపడిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసింది.

ఊహించని ఉపద్రవంలా వచ్చిపడిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అన్ని రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సినీ పరిశ్రమ భవిష్యత్తుపై భయాందోళనలు కలిగిస్తోంది. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లు ప్రారంభించినా ఇంతకుముందులా కౌగిలింత, ముద్దు సన్నివేశాలను తెరకెక్కించడం అంత ఈజీ కాదు. ఈ విషయంపై చాలా చర్చ జరుగుతోంది.
ఈ అంశంపై తాజాగా హీరోయిన్ లావణ్యా త్రిపాఠి తన మనసులో మాటను బయటపెట్టింది. `ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల్లో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాలంటే చాలా ఆలోచించాల్సిందే. ఇకపై అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వస్తే నేను `నో` చెబుతాను. కరోనా మహమ్మారి భయపెడుతున్న ఈ రోజుల్లో అలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది. మన ఆరోగ్యం, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాన`ని లావణ్య చెప్పింది.