నాన్నగారి ఆరోగ్యం మెరుగవుతోంది: ఎస్.పి. చరణ్

ABN , First Publish Date - 2020-08-17T03:54:13+05:30 IST

కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 5వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. అయితే ఉన్నట్లుండి

నాన్నగారి ఆరోగ్యం మెరుగవుతోంది: ఎస్.పి. చరణ్

కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 5వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. అయితే ఉన్నట్లుండి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. వెంటనే ఐసీయూకి తరలించి వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని, కోలుకుంటున్నారని తెలిపారు ఎస్.పి. బాలు తనయుడు ఎస్.పి చరణ్. 


ఆదివారం మీడియాతో మాట్లాడిన ఎస్.పి. చరణ్.. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వివరించారు. ‘‘నాన్నగారి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగవుతోంది. డాక్టర్లు ఆయనని ప్రత్యేక ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై ఉన్నా.. చికిత్సకు స్పందిస్తున్నారు. గతంతో పోలిస్తే మరింత సులభంగా శ్వాస తీసుకుంటున్నారు. దయచేసి ఎవరూ కంగారు పడకండి. మీ ప్రార్థనలతో నాన్నగారు కొద్దిరోజుల్లో కోలుకుని క్షేమంగా వచ్చి.. మళ్లీ ఎప్పటిలాగే అలరిస్తారు..’’ అని ఎస్.పి. చరణ్ తెలిపారు.Updated Date - 2020-08-17T03:54:13+05:30 IST