అవును.. నాకు చాలామందితో బ్రేకప్స్ జరిగాయి: లక్ష్మీరాయ్
ABN , First Publish Date - 2020-05-01T16:28:24+05:30 IST
సెక్సీ హీరోయిన్‌గా, ఐటెం బాంబ్‌గా పలు భాషల్లో గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ లక్ష్మీ రాయ్

సెక్సీ హీరోయిన్‌గా, ఐటెం బాంబ్‌గా పలు భాషల్లో గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ లక్ష్మీ రాయ్. పలు ఐటెమ్ సాంగ్స్‌తో టాలీవుడ్‌లో కూడా ఈ భామ మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించిన లక్ష్మీరాయ్ గతంలో పలుసార్లు ప్రేమలో పడిందట.
తన లవ్ అఫైర్ల గురించి వస్తున్న వార్తలపై ఇటీవల లక్ష్మీరాయ్ స్పందించింది. `అవును.. నేను గతంలో పలుసార్లు ప్రేమలో పడ్డాను. చాలా మందితో బ్రేకప్‌లు కూడా జరిగాయి. మూడు సార్లు ప్రేమలో మోసపోయా` అంటూ చెప్పుకొచ్చింది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో కూడా లక్ష్మీరాయ్ ప్రేమాయణం సాగించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి లక్ష్మీరాయ్ ప్రేమలో పడినట్టు సమాచారం. బాలీవుడ్‌కు చెందిన నిర్మాత కొడుకుతో లక్ష్మీరాయ్ ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి, ఈ వార్తల గురించి లక్ష్మీరాయ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.