ఐఫోన్‌లో ‘లాక్‌డౌన్‌’ చిత్రీకరణ

ABN , First Publish Date - 2020-04-28T19:40:20+05:30 IST

గ్లామరస్‌తార ఆండ్రియా జర్మియా ప్రధాన పాత్రలో ‘లాక్‌డౌన్‌’ పేరుతో ఒక షార్ట్‌ ఫిలిం చిత్రీకరిచారు.

ఐఫోన్‌లో ‘లాక్‌డౌన్‌’ చిత్రీకరణ

కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించిన కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయి నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కొందరు తమ వీలును బట్టి ఒంటరిగా పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్లామరస్‌తార ఆండ్రియా జర్మియా ప్రధాన పాత్రలో ‘లాక్‌డౌన్‌’ పేరుతో ఒక షార్ట్‌ ఫిలిం చిత్రీకరిచారు. లాక్‌డౌన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఐఫోన్‌లో చిత్రీకరించడంతో ఈ ప్రాజెక్టుపై అందరి దృష్టి పడింది. ఆదవ్‌ వి.కన్నదాసన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్‌ఫిలింకి నితిన్‌ రామ్‌ సినిమాటోగ్రఫి అందించారు. ఆర్ట్‌ వెంచర్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఈ షార్ట్‌ఫిలింను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు.

Updated Date - 2020-04-28T19:40:20+05:30 IST