తొలి స్నేహితుడ్ని కోల్పోయా ‘కుశుడు’ నాగసుబ్రహ్మణ్యం

ABN , First Publish Date - 2020-09-08T06:06:58+05:30 IST

నాగరాజు మరణవార్త వినగానే నాగసుబ్రహ్మణ్యం ఒక్కసారిగా బోరున విలపించారు. తన జీవితంలో తొలి స్నేహితుడైన నాగరాజు ఇక లేడన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు...

తొలి స్నేహితుడ్ని కోల్పోయా ‘కుశుడు’ నాగసుబ్రహ్మణ్యం

నాగరాజు మరణవార్త వినగానే నాగసుబ్రహ్మణ్యం ఒక్కసారిగా బోరున విలపించారు. తన జీవితంలో తొలి స్నేహితుడైన నాగరాజు ఇక లేడన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘‘లవకుశ’ విడుదలయిన తరువాత చెన్నై నుంచి అమలాపురం వరకు ఎన్నో ప్రాంతాల్లో కలిసే పర్యటించాం. ఎన్నో రంగస్థల ప్రదర్శనలు ఇచ్చాం. పెరిగి పెద్దయిన తరువాత హైదరాబాద్‌లో స్థిరపడ్డ నాగరాజు ఒక ఆలయంలో పూజారిగా పనిచేసేవారు. ఆ ఆలయాన్ని నమ్ముకుని జీవించాడు. 2013లో లవకుశ చిత్రం విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంజలీదేవి పేరుమీద చెన్నైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఒకే వేదికపై అవార్డులు అందుకున్నాం. సీతమ్మ పాత్రధారి అంజలీదేవి పేరిట ఇచ్చిన అవార్డుతో ఇద్దరం ఎంతో ఆనందించాం. తరువాత అమలాపురంలోని కామాక్షీ పీఠాన్ని సందర్శించాం’’ అని చెప్పారు నాగ సుబ్రహ్మణ్యం.

Updated Date - 2020-09-08T06:06:58+05:30 IST