మీరాచోప్రా ఫిర్యాదుపై కేటీఆర్ స్పందన!

ABN , First Publish Date - 2020-06-05T22:20:34+05:30 IST

హీరోయిన్ మీరా చోప్రా, ఎన్టీయార్ అభిమానుల మధ్య వివాదం మరింత ముదురుతోంది.

మీరాచోప్రా ఫిర్యాదుపై కేటీఆర్ స్పందన!

హీరోయిన్ మీరా చోప్రా, ఎన్టీయార్ అభిమానుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. నాలుగైదు రోజులుగా హీరోయిన్ మీరా చోప్రాపై ఎన్టీయార్ అభిమానులు అసభ్యకరంగా దూషణలకు దిగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఓ నెటిజన్ ప్రశ్నకు మీరా స్పందిస్తూ.. `నాకు ఎన్టీయార్ గురించి తెలియదు. నేను ఎన్టీయార్ ఫ్యాన్‌ను కాదు.. నాకు మహేష్ అంటేనే ఎక్కువ ఇష్టం` అని సమాధానమిచ్చింది. దీంతో ఎన్టీయార్ అభిమానులు మీరాపై బెదిరింపులకు దిగారు. మీరాపై సామూహిక అత్యాచారానికి పాల్పడతామని, ఆమెపై యాసిడ్ పోస్తామని, ఆమె తల్లిదండ్రులను చంపేస్తామని ట్వీట్లు చేశారు. 


అభిమానుల ఆగడాలను అరికట్టాల్సిందిగా ఎన్టీయార్‌ను ట్యాగ్ చేస్తూ మీరా చోప్రా ట్వీట్ చేసింది. అయినప్పటికీ ఎన్టీయార్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఈ రోజు (శుక్రవారం) ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ మీరా ట్వీట్ చేసింది. కొద్ది గంటల్లోనే మీరా ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. `మేడమ్.. మీ ఫిర్యాదు ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోమని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్‌కు విజ్ఞప్తి చేశాన`ని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. కేటీఆర్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
Updated Date - 2020-06-05T22:20:34+05:30 IST