పెళ్లి పీట‌లెక్కిన మరో ద‌ర్శ‌కుడు.. కన్ఫ్యూజన్‌లో ప్రేక్షకులు

ABN , First Publish Date - 2020-07-16T23:43:10+05:30 IST

ఇటీవల ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ప్రవల్లిక అనే అమ్మాయితో ఇటీవలే సుజీత్ వివాహం జరిగింది. లాక్‌డౌన్‌లో అతి తక్కువ మంది సమక్షంలో

పెళ్లి పీట‌లెక్కిన మరో ద‌ర్శ‌కుడు.. కన్ఫ్యూజన్‌లో ప్రేక్షకులు

ఇటీవల ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ప్రవల్లిక అనే అమ్మాయితో ఇటీవలే సుజీత్ వివాహం జరిగింది. లాక్‌డౌన్‌లో అతి తక్కువ మంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఇప్పుడు సుజీత్ బాటలోనే మరో దర్శకుడు కామ్‌గా మ్యారేజ్ కానిచ్చేశారు. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? ‘క్షణం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న రవికాంత్ పేరెపు. సుమారు 5 సంవత్సరాలుగా వీణా ఘంటశాల అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న రవికాంత్ ఎట్టకేలకు ఈ శనివారం చెన్నైలో అతి తక్కువ మంది సమక్షంలో తన పెళ్లి వేడుకను ముగించినట్లుగా తెలుస్తుంది. 


అయితే రవికాంత్ పేరెపు పెళ్లి 2017లోనే అయిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. పెళ్లి ఫొటోలు కూడా అప్పట్లో విడుదల చేశారు. మరి మళ్లీ ఆయన పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. అప్పట్లో ఆయన చేసుకున్న అమ్మాయి పేరు కూడా వీణ అనే వినిపించింది. మరి మళ్లీ వీణ అనే అమ్మాయితోనే పెళ్లి జరిగింది. మరి ఈ కన్ఫ్యూజన్ ఏమిటో తెలియాలంటే ఆయనే అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రవికాంత్ పేరెపు తన భార్య వీణాతో ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఇక రవికాంత్ పేరెపు తాజాగా దర్శకత్వం వహించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్, షాలిని, శీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు.


క్రింది ఫొటో 2017లో రవికాంత్ పేరెపు పెళ్లి అయినట్లుగా విడుదలైన ఫొటో

Updated Date - 2020-07-16T23:43:10+05:30 IST