వారి స్వేచ్ఛను హరిస్తున్నారు: మహేష్ హీరోయిన్

ABN , First Publish Date - 2020-05-14T22:35:47+05:30 IST

హీరోయిన్ కృతిసనన్ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా

వారి స్వేచ్ఛను హరిస్తున్నారు: మహేష్ హీరోయిన్

హీరోయిన్ కృతిసనోన్ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అయితే ఈ భామ ఈ మధ్య బాగా వార్తలలో నిలుస్తుంది. వారసత్వం గురించి ఆ మధ్య హాట్‌హాట్‌గా మాట్లాడి.. బాలీవుడ్‌లోని వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చెప్పిన కృతి.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచేలా కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ‘బాయ్స్ లాకర్ రూమ్’పై తాజాగా ఆమె స్పందించింది. ఆడ, మగ అనే వివక్ష వల్లే ఇటువంటివి జరుగుతున్నాయని తెలిపింది.


ఆమె మాట్లాడుతూ..‘‘హద్దులకు లోబడి నడిచే ఏ విషయమైనా పద్దతిగానే ఉంటుంది. అమ్మాయి అందంగా ఉంది అని చెప్పడంలో తప్పు లేదు. ఆ తర్వాత చేసే కామెంట్సే హద్దులు మీరడం అంటారు. ఆ హద్దులు మీరితే శిక్షించాల్సిందే. వక్రబుద్ధిగా ఆలోచించేవారిలో ఎప్పటికీ మార్పు రాదు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు వివక్షను చూపించబట్టే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. మగ, ఆడ అనే భేదం బాగా ఎక్కువైంది. ఆడపిల్లల్ని తక్కువగా చూడటం ఇంకా మారలేదు. ఆడవారి స్వేచ్ఛను హరిస్తున్నారు. ఆడ, మగ సమానం అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకు తెలిసేలా తల్లిదండ్రులు పిల్లలను పెంచాలి. పెద్దవాళ్లను గౌరవించడం నేర్పాలి. తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతతో పెంచాలి. అప్పుడే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి..’’ అని కృతి తెలిపింది.

Updated Date - 2020-05-14T22:35:47+05:30 IST