సుశాంత్ చివరి సినిమాపై కృతి ఎమోషనల్ పోస్ట్!

ABN , First Publish Date - 2020-07-27T17:50:11+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా `దిల్ బెచారా` ఇటీవల విడుదలైంది.

సుశాంత్ చివరి సినిమాపై కృతి ఎమోషనల్ పోస్ట్!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా `దిల్ బెచారా` ఇటీవల విడుదలైంది. డిస్నీ+హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందకు వచ్చింది. సుశాంత్ చివరి సినిమా కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 


ఈ సినిమా గురించి సుశాంత్ మాజీ ప్రేయసి, హీరోయిన్ కృతి సనోన్ భావోద్వేగ పోస్ట్ చేసింది. `సుశాంత్.. నా హృదయం బద్ధలైపోతోంది. దీనిని జీర్ణించుకోలేకపోతున్నా. తెరపై మ్యానీ (`దిల్ బెచారా`లో సుశాంత్ పాత్ర పేరు)ని చూసి ఎంతో వేదనకు గురయ్యా. నువ్వు నిజంగానే జీవించి వచ్చావనిపించింది. అద్భుతంగా నటించావు. నువ్వు తెరపై మేజిక్ చేశావ`ని కృతి పేర్కొంది. 
Updated Date - 2020-07-27T17:50:11+05:30 IST

Read more