అలా ఉంటేనే మనుగడ సాగించగలం: కృతి

ABN , First Publish Date - 2020-10-27T18:13:01+05:30 IST

నటిగా లేదా నటుడిగా మనుగడ సాగించాలంటే సెన్సిటివ్‌గా ఉండకూడదని అంటోంది హీరోయిన్ కృతి కర్బందా

అలా ఉంటేనే మనుగడ సాగించగలం: కృతి

నటిగా లేదా నటుడిగా మనుగడ సాగించాలంటే సెన్సిటివ్‌గా ఉండకూడదని అంటోంది హీరోయిన్ కృతి కర్బందా. తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన కృతి ప్రస్తుతం బాలీవుడ్ మీద దృష్టి సారించింది. కృతి నటించిన `తయాస్` సినిమా ఈ నెల 29న ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. 


ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన కృతి ఓ ఆసక్తికర విషయం గురించి మాట్లాడింది. `మనకు మనమే ఓ పెద్ద చీర్ లీడర్ కావాలి. సెన్సిటివ్‌గా ఉండకూడదు. మనల్ని మనమే నిరంతరం మోటివేట్ చేసుకోవాలి. నీ పోరాటాన్ని మధ్యలో ఆపేస్తే, ఈ ప్రపంచంలో ఒక్కరూ కూడా నీకు సహాయం చెయ్యరు. పోరాటం చేయాలని డిసైడ్ అయితే ఈ ప్రపంచం నిన్నేమీ చెయ్యలేదు. మనల్ని దెబ్బ తీయడానికి చాలా మంది మన చుట్టూ ఉంటారు. అయినా నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకూడద`ని కృతి పేర్కొంది. 

Updated Date - 2020-10-27T18:13:01+05:30 IST