నిర్మాతగా మారిన కృష్ణుడు

ABN , First Publish Date - 2020-08-05T23:37:26+05:30 IST

‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాల కథానాయకుడు, ప్రముఖ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు.

నిర్మాతగా మారిన కృష్ణుడు

‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాల కథానాయకుడు, ప్రముఖ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్‌ అని ఆయన ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ నిర్మించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో ప్రచార చిత్రాలు విడుదల చేయనున్నారు.


ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ ‘‘నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ఉంటుంది. కొత్త కథ, కథనాలతో సినిమా తెరకెక్కించాం. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తా’’ అని అన్నారు.ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్ ను దర్శకుడిగా  తెలుగు తెర కు పరిచయం చేయబోతున్నారు కృష్ణుడు.

Updated Date - 2020-08-05T23:37:26+05:30 IST