సూపర్‌ స్టార్‌ ‘సంతానం సౌభాగ్యం’ చిత్రానికి 45 ఏళ్ళు

ABN , First Publish Date - 2020-10-25T04:36:01+05:30 IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ, డైనమిక్‌ లేడీ విజయనిర్మల జంటగా నటించిన చిత్రం 'సంతానం సౌభాగ్యం'. డిఎస్‌ ప్రకాశ్‌రావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేటితో (అక్టోబర్‌ 24) 45 సంవత్సరాలు

సూపర్‌ స్టార్‌ ‘సంతానం సౌభాగ్యం’ చిత్రానికి 45 ఏళ్ళు

సూపర్‌ స్టార్‌ కృష్ణ, డైనమిక్‌ లేడీ విజయనిర్మల జంటగా నటించిన చిత్రం 'సంతానం సౌభాగ్యం'. డిఎస్‌ ప్రకాశ్‌రావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేటితో (అక్టోబర్‌ 24) 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 24 అక్టోబర్‌ 1975లో ఈ చిత్రం విడుదలైంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన కుటుంబ కథా చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కె. వెంకటరామరెడ్డి సమర్ఫణలో రవిరాజ్‌ కంబైన్స్‌ బ్యానర్‌పై కేశన జయరామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి శంకర్‌ సంగీతం అందించారు. అప్పలాచార్య, మదన్‌ మోహన్‌.. మాటలు, లక్ష్మణ గారే.. కెమెరా, రాజేంద్రకుమార్‌.. ఆర్ట్ వర్క్‌, వీరప్ప.. ఎడిటింగ్‌ బాధ్యతలను నెరవేర్చారు. శంకర్‌ సంగీతంలో రూపుదిద్దుకున్న 'చెలి నీ తోడుగా', 'ముద్దు ముద్దు బొమ్మలు', 'బావా బావా పన్నీరు' వంటి పాటలు ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి.Updated Date - 2020-10-25T04:36:01+05:30 IST

Read more