కొత్త సంవత్సరం రోజున 'క్రాక్‌' ట్రైలర్‌

ABN , First Publish Date - 2020-12-29T00:01:08+05:30 IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్'.

కొత్త సంవత్సరం రోజున 'క్రాక్‌' ట్రైలర్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంలో బిజీగా ఉంది. ఎస్‌.ఎస్‌. థమ‌న్ బాణీలు స‌మ‌కూర్చిన మూడు పాట‌ల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్రంలోని మూడో సాంగ్ లిరిక‌ల్ వీడియోను క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసిన 'కోర‌మీసం పోలీసోడా..' అంటూ సాగే పాటలకు మంచి స్పందన వచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా జనవరి 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్‌'లో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను ఆక‌ట్టుకునే అంశాలున్నాయని చిత్రయూనిట్‌ తెలిపింది. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్ర‌ఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 

Updated Date - 2020-12-29T00:01:08+05:30 IST