కరోనా టైమ్‌..'క్రాక్'‌ మూవీ మేకింగ్‌

ABN , First Publish Date - 2020-10-12T15:21:07+05:30 IST

కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ 'క్రాక్‌' యూనిట్‌ షూటింగ్‌ను ఎలా నిర్వహిస్తుందనే విషయాలతో ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

కరోనా టైమ్‌..'క్రాక్'‌ మూవీ మేకింగ్‌

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్‌'. ఈసినిమా తుది దశ షూటింగ్‌ రీసెంట్‌గా రీస్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ 'క్రాక్‌' యూనిట్‌ షూటింగ్‌ను ఎలా నిర్వహిస్తుందనే విషయాలతో ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. యూనిట్‌ సభ్యులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడం, యూనిట్‌ సభ్యులు మాస్కులు ధరించి శానిటైజర్స్‌ ఉపయోగిస్తూ షూటింగ్‌లో పాల్గొనే సన్నివేశాలన్నీ ఈ మేకింగ్‌ వీడియోలో ఉన్నాయి. ఠాగూర్‌ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇందులో కీలక పాత్రల్లో  నటిస్తున్నారు. 'డాన్‌శీను, బలుపు' చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలున్నాయి. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. 
Updated Date - 2020-10-12T15:21:07+05:30 IST

Read more