‘క్రాక్’.. ‘కోర‌మీసం పోలీసోడా..’ పాట అదిరింది

ABN , First Publish Date - 2020-12-25T22:25:19+05:30 IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పాట‌ల‌తో స‌హా

‘క్రాక్’.. ‘కోర‌మీసం పోలీసోడా..’ పాట అదిరింది

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పాట‌ల‌తో స‌హా పూర్త‌యింది. ఎస్‌.ఎస్‌. థమ‌న్ బాణీలు స‌మ‌కూర్చిన రెండు పాట‌ల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్రంలోని మూడో సాంగ్ లిరిక‌ల్ వీడియోను క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుద‌ల చేశారు. 'కోర‌మీసం పోలీసోడా..' అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీకి రామ‌జోగ‌య్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంటోంది. గాయ‌ని ర‌మ్యా బెహ‌రా తన గాత్రంతో ఈ పాట‌కు ప్రాణం పోసింది. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ర‌వితేజ‌ను టీజ్ చేస్తూ శ్రుతి హాస‌న్ పాడే పాట‌గా దీనిని చిత్రీక‌రించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాట‌లు సంగీత ప్రియుల‌ను అల‌రిస్తూ మ్యూజిక్ చార్టుల్లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రిలీజైన "కోర‌మీసం పోలీసోడా.." సాంగ్ వాటిని మించేలా ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్‌'లో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను ఆక‌ట్టుకునే అంశాలున్నాయని చిత్రయూనిట్‌ తెలిపింది. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్ర‌ఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా 'క్రాక్' మూవీని విడుద‌ల చేయ‌డానికి చిత్రయూనిట్‌ స‌న్నాహాలు చేస్తోంది.Updated Date - 2020-12-25T22:25:19+05:30 IST