క్రాక్ సాంగ్.. ఈ రాత్రికి ఫుల్ మీల్సేనట..
ABN , First Publish Date - 2020-11-14T01:31:53+05:30 IST
మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'క్రాక్'. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి

మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'క్రాక్'. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా చిత్రయూనిట్ తెలుపుతోంది. ఇక దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని.. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్ర బృందం 'భూమ్ బద్దల్' లిరికల్ వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేసింది. రవితేజ, అప్సరా రాణిపై ఈ ఐటమ్ నంబర్‌ను చిత్రీకరించారు.
సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతంలో రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌ని జోరుగా సాగే లైన్లతో రామజోగయ్య శాస్త్రి రచింపగా, మాస్ బీట్స్‌కు తగ్గట్లు సింగర్స్ సింహా, మంగ్లీ హుషారుగా, మంచి ఎనర్జీతో ఈ పాటను ఆలపించారు. జాని మాస్టర్ సూపర్బ్ కొరియోగ్రఫీ సమకూర్చారు. ఈ పాటలో వచ్చే లిరిక్స్ నిజంగానే మాస్ ప్రేక్షకులను అలరించేవిగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫుల్ మీల్స్ అనేలా ఉన్నాయి. టెర్రిఫిక్ డాన్స్ స్టెప్పులతో రవితేజ డాన్స్ చేయగా, అప్సరా రాణి అందాలు కనువిందు చేసే రీతిలో ఉన్నాయి. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
