వేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-25T20:52:19+05:30 IST

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్నలు హీరోలుగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'కోతి కొమ్మచ్చి' . లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

వేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్నలు హీరోలుగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం  'కోతి కొమ్మచ్చి' . లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన  నిర్మాత దిల్ రాజు మొదటి షాట్ కి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు.  అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ " యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న మా చిత్రాన్ని విజయదశమి పర్వదినం రోజు ప్రారంభించడం హ్యాపీగా ఉంది. నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు పెడతాం. ఆ తర్వాత వైజాగ్ లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాం. ఒకే షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాం." అని తెలిపారు. నిర్మాత ఎం ఎల్ వి సత్యానారాయణ మాట్లాడుతూ " సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్న సతీష్ గారు మా బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేఘమ్ష్ శ్రీహరి , సమీర్ లకు ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నాం." అన్నారు. త్వరలోనే షూటింగ్ లో పాల్గోనబోతున్నాం. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాం" అని కథానాయకులు మేఘమ్ష్ శ్రీహరి , సమీర్ వేగేశ్న ఆకాక్షించారు. 


Updated Date - 2020-10-25T20:52:19+05:30 IST

Read more