ఇకపై అలాంటి తప్పు చేయను: కొరటాల శివ

ABN , First Publish Date - 2020-04-16T14:46:22+05:30 IST

వరుస విజయాలు సాధిస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు కొరటాల శివ.

ఇకపై అలాంటి తప్పు చేయను: కొరటాల శివ

వరుస విజయాలు సాధిస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు కొరటాల శివ. మహేష్ బాబు హీరోగా కొరటాల రూపొందించిన `భరత్ అనే నేను` సినిమా విడుదలై మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పటివరకు ఆయన రూపొందించిన మరో సినిమా విడుదల కాలేదు. 


మెగాస్టార్ చిరంజీవి గురించి వెయిట్ చేయడమే దీనికి కారణం. గ్యాప్ రావడం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడారు. `మూడేళ్లుగా నా నుంచి సినిమా లేదు. దీనికి ఎవరినీ తప్పుబట్టను. పరిస్థితుల ప్రభావం వల్లే అలా జరిగింది. ఇకపై హీరోల కోసం వెయింటింగ్ చేయను. నేను కథ పూర్తి చేసే సమయానికి ఏ హీరో ఖాళీగా ఉంటే ఆ హీరోతోనే సినిమా చేసేస్తాన`ని కొరటాల శివ చెప్పారు. 

Updated Date - 2020-04-16T14:46:22+05:30 IST

Read more